బెంగళూరులో నూతన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో భారీ ట్రాఫిక్ జామ్

రిపోర్టర్: సునీల్ స్థలం: Bengaluru

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు ప్రధాన రోడ్లకే పరిమితం కాకుండా ఏకంగా నివాస సముదాయాల లోపలికి కూడా పాకాయి. నగరంలోని వర్తూరు ప్రాంతంలో ఉన్న బ్రిగేడ్ ఉటోపియా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోపల వాహనాలు బారులు తీరి నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రధాన రోడ్డును చేరుకోవడానికి నివాసితులు అపార్ట్ మెంట్ ఆవరణలోనే అర్ధగంట పాటు నిరీక్షించాల్సి వస్తోందని, ఇరుకైన రోడ్ల కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.