నిరుద్యోగులకు భారీ ఊరట: గ్రూప్-2 మరియు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: ఏలూరు

యువతకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి మరియు నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఏలూరులో ఆయన స్పందిస్తూ తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్తో పాటు 668 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని, మరో డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి 2,171 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.