జపాన్ లో ఎంఎంఏ అథ్లెట్ వరుణ్ సన్యాల్ కు తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: జపాన్

జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన భారత ఎంఎంఏ అథ్లెట్ వరుణ్ సన్యాల్ నిర్వాహకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగోయా చేరుకున్న తనకు సిస్టమ్ లో పేరు కనిపించకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని, ఎలాంటి ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై ఆయన చేసిన వీడియో ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.