రూపాయి అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ కృష్ణవేణి సవాల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో తనపై మున్సిపల్ చైర్పర్సన్ చేసిన అవినీతి ఆరోపణలను కౌన్సిలర్ కృష్ణవేణి రజిత తీవ్రంగా ఖండించారు. తాను పథకాల కేటాయింపుల్లో రూ. 10 లక్షలు లంచం తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనపై రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించారు. ఈ విషయంపై పట్టణంలో చర్చ నడుస్తోంది.