యువ ఐపీఎస్ అధికారులకు అసిస్టెంట్ ఎస్పీలుగా పోస్టింగులు జారీ
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాష్ట్ర క్యాడర్‌కు చెందిన నలుగురు యువ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ ఎస్పీలుగా పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొబేషనరీ అధికారులైన వీరు ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. నలుగురు యువ అధికారులకు వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.