వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్ లో కలకలం: అభ్యర్థుల గుర్తులు తారుమారు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Tirupati
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల వేళ తీవ్ర గందరగోళం నెలకొందని అధికారులు తెలిపారు. పట్టణంలోని ముై ఐదో వార్డు పోలింగ్ బూత్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయని వారు వెల్లడించారు. తెలుగుదేశం అభ్యర్థికి కేటాయించాల్సిన సైకిల్ గుర్తు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ముందు ముద్రించబడిందని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారని, తక్షణమే తప్పును సరిదిద్ది పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.