పాలేరు పాత కాల్వకు నీరు వదలకపోతే రిజర్వాయర్ దిగ్బంధం చేస్తాం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

పాలేరు పాత కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో వేలాది మంది రైతులతో రిజర్వాయర్‌ను దిగ్బంధం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాల్వను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సాగు, తాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని, పాలేరు ప్రదాత అని చెప్పుకునే మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.