మహమ్మారిని జయించి అన్నదానమే ప్రాణంగా: క్యాన్సర్ బాధితురాలి సేవలు అద్భుతం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Pune
క్యాన్సర్ మహమ్మారిని జయించి ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులా మారుతున్నారు పుణెకు చెందిన హర్షడ ప్రకాశ్ తెమ్ఘాడే. తీవ్ర అనారోగ్యంతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడిన ఆమె, దేవుడు తనకు రెండో జన్మ ప్రసాదించాడనే భావనతో అన్నదానమే పరమావధిగా జీవిస్తున్నారు. పుణెలోని వార్గావ్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ వంటకాలను తయారు చేస్తూ, రోగులకు మరియు నిరుపేదలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు.