వైద్య, విద్యారంగాలకు ప్రభుత్వ పెద్దపీట: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: ఖమ్మం
సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైద్య మరియు విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాలేరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి పేద ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.