ఎలన్ మస్క్ పనితీరుపై మాజీ సీఈఓ లిండా యాకారినో కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

టెక్కీ దిగ్గజం ఎలన్ మస్క్ పనితీరులో అత్యంత వేగం ఉంటుందని ఆయనతో కలిసి పనిచేసిన మాజీ సీఈఓ లిండా యాకారినో వెల్లడించారు. ఎక్స్ సంస్థలో పనిచేసిన అనుభవం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మస్క్కు వేచి ఉండే గుణం అసలు లేదని, ప్రతి పనిని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటారని పేర్కొన్నారు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ అత్యవసరంగా ఉంటాయని, ప్రణాళికలను అమలు చేయడంలో ఆయన ఆలోచనా విధానం ఎంతో విభిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు.