ఆస్పత్రిలో పరామర్శ: పక్షవాతంతో బాధపడుతున్న భద్రమ్మను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చెన్నారావుపేట
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల తండాకు చెందిన వార్డు సభ్యుడు రవి నాయక్ తల్లి భద్రమ్మ అనారోగ్యంతో హనుమకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు మరియు జర్నలిస్ట్ సంఘం ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, భద్రమ్మ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.