అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్ వ్యూహం రిపబ్లికన్లకు పెద్ద తలనొప్పిగా మారిందా

రిపోర్టర్: నరేష్ స్థలం: Washington

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. నన్ను కూడా బ్యాలెట్ పై ఉన్నట్లుగా భావించి ఓటేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరడం సొంత పార్టీకి కొత్త తలనొప్పిగా మారిందని విశ్లేషకులు తెలిపారు. స్థానిక సమస్యల నుంచి చర్చను ట్రంప్ పాలన వైపు మళ్లించడం వల్ల రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని పేర్కొన్నారు.