ఏటీఎస్ల బకాయిల విడుదలకు కమిషన్ డిమాండ్: అమాత్యుడి అనుచరుడి బెదిరింపులతో కలకలం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
వాహన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నిర్వాహకులకు రూ.40 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ఓ మంత్రి అనుచరుడు పది శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బకాయిల దస్త్రానికి క్లియరెన్స్ ఇవ్వాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని ఇవ్వాలని, కుదరకపోతే సెంటర్లు వదిలేసి వెళ్లిపోవాలని ఆయన హుకుం జారీ చేసినట్లు నిర్వాహకులు వాపోతున్నారు.