వైద్య రంగంలో అరుదైన ఘనత: ఎండోస్కోపీ ద్వారా తొలిసారిగా వెన్నుముక శస్త్రచికిత్స

రిపోర్టర్: సునీల్ స్థలం: Kannur

కేరళలోని కన్నూరుకు చెందిన పదహారేళ్ల బాలుడికి వెన్నుముక కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వైద్యులు యుబీ ఎండోస్కోపీ విధానం ద్వారా అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ హరి కృష్ణన్ వెల్లడించారు. దేశంలోనే ఈ అత్యాధునిక కీహోల్ పద్ధతిలో కోకిజిక్టమీ చేయడం ఇదే తొలిసారమని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నూతన విధానం ద్వారా రోగి త్వరగా కోలుకోవడంతో పాటు సాధారణ జీవితానికి తిరిగి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.