కీళ్ల నొప్పుల గౌట్‌కు గుండెపోటుకు మధ్య సంబంధంపై వైద్య నిపుణుల హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్లలో స్పటికాలుగా ఏర్పడి వచ్చే గౌట్ సమస్య హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ లీడ్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ తెలిపారు. కేవలం యూరిక్ యాసిడ్ పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ గుండె సమస్యలొస్తాయని చెప్పలేమని, అయితే హైబీపి, ఊబకాయం, మధుమేహం వంటి పరిస్థితులు గుండెపై అదనపు ఒత్తిడి కలిగిస్తాయని వైద్యులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలితో పాటు వైద్యుల సలహాతో మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.