ఐఐటీ మండిలో భగవద్గీత పోస్టర్ వివాదం, విచారణకు ఆదేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హిమాచల్ ప్రదేశ్
ఐఐటీ మండిలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా ప్రదర్శించిన భగవద్గీత పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. శూద్రుల పాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటంతో కుల వివక్ష ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా, సంస్థకు దీనితో సంబంధం లేదని స్పష్టం చేస్తూ విచారణకు ఆదేశించారు.