ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని ఓఖ్లాలో జరిగిన ఘోర ఆక్సిజన్ సిలిండర్ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ పేలడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.