గజపతినగరంలో పటిష్ట భద్రత నడుమ పోటెత్తిన ఓటర్లు

రిపోర్టర్: andluri ganesh స్థలం: గజపతినగరం

గజపతినగరం మండలంలో గురువారం ఉదయం ఏడు గంటలకు ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. సీఐ సన్యాసినాయుడు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. పలు పోలింగ్ కేంద్రాలను అభ్యర్థులు మండల సూర్య కళ, రెడ్డి పావని స్వయంగా సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.