గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రూ.2,052 కోట్లతో అడవిపల్లె బాట 2.0

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రూ.2,052 కోట్లతో అడవిపల్లె బాట 2.0కు శ్రీకారం చుట్టి మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యాలను విస్తరిస్తున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. గిరిజన గ్రామాలను డోలీ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్ది విద్య వైద్యం ఉపాధి అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇరవై ఐదు ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని గ్రామగ్రామాన అంగన్వాడీ ఉత్సవాలు జరుగుతున్నాయని చిన్నారుల శారీరక మానసిక వికాసానికి పునాది వేసే కేంద్రాలను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది.