కొత్తపట్నం బీచ్ లో కలకలం: తీరానికి కొట్టుకొచ్చిన బోటులో నాలుగు మృతదేహాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ వద్ద సముద్రంలో తుఫాన్ ప్రభావంతో కొట్టుకువచ్చిన బోటులో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. చెన్నైకి చెందిన ఈ బోటులో మొత్తం పన్నెండు మంది వరకు ఉండవచ్చని, తుఫాన్ ఉద్ధృతికి సముద్రంలో చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అందింది.