పోలీస్ ఉద్యోగార్థుల ఉచిత కోచింగ్ వరంలాంటిదని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: హన్మకొండ

కష్టపడే తత్వానికి ప్రత్యామ్నాయం లేదని, పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఒక వరం లాంటిదని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ల సహకారంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. ఈ సదవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.