నటనా లోకంలో విషాదం: ప్రముఖ మరాఠీ నటి మధు కంబికర్ కన్నుమూత

రిపోర్టర్: గోపి స్థలం: Pune

మరాఠీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి మధు కంబికర్ పూణేలో అక్టోబర్ 12న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పక్షవాతం బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. సినిమాల్లో నానా పటేకర్ కు తల్లిగా నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణంతో కళారంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లావణీ నృత్య కళాకారిణిగా కూడా ఆమె ఎంతో పేరు సంపాదించారు.