అమ్యూజ్మెంట్ పార్క్ లో ఘోర ప్రమాదం: రోలర్కోస్టర్ నుండి కిందపడి ఉపాధ్యాయుడు దుర్మరణం

రిపోర్టర్: మహేష్ స్థలం: Georgia

అమెరికాలోని సిక్స్ ఫ్లాగ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లో జరిగిన ఘోర ప్రమాదంలో హసన్ జిహాద్ ఇబ్న్ కరీమ్ అనే ఉపాధ్యాయుడు రోలర్కోస్టర్ నుండి కిందపడి మృతి చెందినట్లు కంపెనీ సీఈఓ జాన్ రిల్లీ వెల్లడించారు. గోలియత్ రైడ్ లో భద్రతా వైఫల్యం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రైళ్లకు తక్షణమే సీట్బెల్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.