ఏషియన్‌ గేమ్స్‌లో ఉజ్బెకిస్థాన్‌పై భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: జపాన్

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 19-0 గోల్స్ తేడాతో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. గిఫు ప్రిఫెక్చురల్‌ గ్రీన్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించారు. స్టార్‌ ప్లేయర్‌ దీపిక ఏకంగా 8 గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషిక, నవనీత్‌ కౌర్, లాల్‌థంత్లువాంగి తదితరులు గోల్స్‌తో హోరెత్తించారు.