'ఫామ్‌హౌస్ భూములను స్వాధీనం చేసుకుంటాం': కేసీఆర్ భూముల సర్వేపై తీవ్ర రాజకీయ దుమారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: సిద్దిపేట
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారులు గురువారం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, ఫామ్‌హౌస్ పరిసరాల్లో సర్వే నెంబర్లు, ప్రభుత్వ భూముల వివరాలపై అధికారుల బృందం ఆరా తీయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.