యువతి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు

రిపోర్టర్: శివ స్థలం: Jabalpur

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌ లో యువతి వేధింపులపై స్థానిక పోలీసులకు సార్థక్ సింగ్ గౌతమ్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఉమరియా జిల్లాకు చెందిన యువతితో కొంతకాలంగా తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ప్రస్తుతం ఆమె తనను తీవ్రంగా వేధిస్తోందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఎస్‌పీ కోత్వాలి అఖిలేశ్ గౌర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.