వైద్య రంగంలో కీలక మైలురాయి: అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరికరం అందుబాటులోకి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రముఖ సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అత్యాధునిక బయోగ్రాఫ్ హారిజన్ పిఈటీ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ నూతన సాంకేతికత ద్వారా క్యాన్సర్ వ్యాధి స్థాయిని అత్యంత ఖచ్చితంగా అంచనా వేయడంతో పాటు, రోగులకు మరింత మెరుగైన, సమగ్రమైన వైద్య చికిత్స అందించడం సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టం చేశారు. తక్కువ రేడియేషన్తో కూడిన ఈ పరీక్ష ద్వారా రోగులకు ఎంతో ఊరట కలుగుతుందని తెలిపారు.