నాసిరకం పనులతో మోడల్ హాస్టల్ను భ్రష్టుపట్టిస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ధన్వాడ

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ ఆదర్శ హాస్టల్లో రూ.56 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు ఆరోపించారు. స్లాబ్ వాటర్ప్రూఫింగ్, దోబీఘాట్, బాత్రూమ్ల నిర్మాణంలో లోపాల వల్ల నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని వాపోయారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించి, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.