కోటాగారంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన హారీష్

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు మండలం కోటాగారం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వి హారీష్ బరిలో నిలిచారు. నవంబర్ ఐదున జరిగే పోలింగ్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ పై రెండు క్రమ సంఖ్యలో ఉన్న సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు.