లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: India

మునుపటి సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు టెక్నికల్ రిబౌండ్ కారణంగా గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మరియు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనడంతో మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.