వృద్ధులలో ఛాతీ ఇన్ఫెక్షన్ ముప్పు: వైద్యులు హెచ్చరిస్తున్న కీలక లక్షణాలివే
రిపోర్టర్: సురేష్
స్థలం: చెన్నై
వృద్ధులలో ఛాతీ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సాధారణంగా జ్వరం వంటి లక్షణాలు కనిపించవని గ్లెనెగల్స్ చెన్నై సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ ఎస్ తెలిపారు. అకస్మాత్తుగా తీవ్రమైన అలసట, ఆకలి మందగించడం, ఎక్కువ సమయం నిద్రపోవడం, అయోమయం వంటి మార్పులను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. వయసురీత్యా వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ సురేష్ ఎస్ హెచ్చరించారు.