సెబీతో వివాదాన్ని ముగించుకున్న అదానీ గ్రూప్ ఐదు కంపెనీలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: భారతదేశం
అదానీ గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీలు వ్యాపార లావాదేవీల వెల్లడిలో జరిగిన లోపాలకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. 2012-13 నాటి లావాదేవీల సమాచారాన్ని సరిగ్గా వెల్లడించలేదన్న ఆరోపణలపై వచ్చిన నోటీసుల నేపథ్యంలో, ఈ కేసుల విచారణను ముగించేందుకు అదానీ కంపెనీలు మొత్తం రూ. 1.51 కోట్ల సెటిల్మెంట్ ఫీజును చెల్లించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు మరో మూడు కంపెనీలు ఈ మొత్తాన్ని చెల్లించడంతో విచారణ ప్రక్రియను ముగిస్తున్నట్లు సెబీ ప్రకటించింది.