తీవ్ర అలర్ట్: దేశ రాజధాని ఢిల్లీని కమ్ముకుంటున్న అత్యంత ప్రమాదకర కాలుష్యం
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధనా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమిత రాయ్ చౌధరి తెలిపారు. ప్రతిఏటా నవంబర్ మొదటి పక్షం రోజుల్ లో అత్యధిక కాలుష్యం నమోదవుతుందని సీపీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆమె వెల్లడించారు. పంట వ్యర్థాల దహనం, పండుగలు, వాహనాల రద్దీ కారణంగా గాలి నాణ్యత మరింత దిగజారిందని, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.