రాప్తాడు ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన స్పందన
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
సమాజంలో జరిగే నేరాలకు సినిమాలను ముడిపెట్టడం సరికాదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్య వేదికగా మాట్లాడారు. హింస పెరగడానికి సినిమాలను బాధ్యతను చేయడం కిడ్నాప్లకు రామాయణాన్ని తప్పుపట్టినట్లే ఉంటుందని ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెరపై పాత్రలను చూసి ప్రేక్షకులు మారరని ఆర్జీవీ పేర్కొన్నారు.