ఓట్ల చోరీకి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు: రాహుల్ గాంధీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి గళం విప్పడం అభినందనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇలాంటి ప్రజాస్వామ్య ఉద్యమాలే దేశంలో సత్యం గెలవడానికి దోహదపడతాయని ఉద్ఘాటించారు. ప్రజల నుంచి వస్తున్న ఈ విశేష స్పందన భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలకు ముగింపు పలకడమే కాకుండా, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థే గెలుస్తుందని స్పష్టం చేశారు.