యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది దుర్మరణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: గ్రేటర్ నోయిడా
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జేవార్ విమానాశ్రయం సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. దిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సామాన్లలో పటాకులు పేలడం వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.