దేవీ నవరాత్రి ఉత్సవాల వేళ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్ ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఐదు కిలోవాట్ల వరకు ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు.