ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు ఇరవై వేల మందికి పైగా సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. శోభాయాత్రను పర్యవేక్షించేందుకు పది వేల సీసీ కెమెరాలు, ఇరవై నాలుగు డ్రోన్లతో నిఘా పెంచారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు అన్ని ముందస్తు చర్యలు విజయవంతంగా పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.