సోలార్ విద్యుత్ ప్రచారంతో పాటు అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కీలక ఆదేశాలు

రిపోర్టర్: గోపి స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు, విద్యారంగం మరియు సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని, అంతర్గాం నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని, అలాగే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొంటూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.