మిషన్ జ్యోతిర్గమయ: విశాఖలో ఆకలి తీరుస్తున్న సిటీ పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన అయిదు కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులకు, ఆకలితో ఉన్నవారికి నిత్యం ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు VizagCityPolice వెల్లడించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆహారం వృథా కాకుండా ఈ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవతా దృక్పథంతో ప్రారంభించిన ఈ సేవలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.