బెంగళూరు జొమాటో వేర్హౌస్లో హిందీ వివాదం: స్థానిక సిబ్బందిపై మేనేజర్ ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని జొమాటో వేర్హౌస్లో హిందీ మాట్లాడాలని, లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లాలని స్థానిక సిబ్బందిని హెచ్చరించిన సూపర్వైజర్ అశోక్ ఉదంతం తీవ్ర దుమారం రేపింది. కర్ణాటకలో హిందీ మాత్రమే మాట్లాడుతానంటూ ఆయన చేసిన వ్యా్ఖ్యల వీడియో వైరల్ కావడంతో తీవ్ర ప్రజా ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై కన్నడ అనుకూల కార్యకర్తలు నిరసన తెలపగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అశోక్ కన్నడలోనే క్షమాపణలు కోరారని పోలీసు అధికారులు తెలిపారు.