ఆళ్లగడ్డ అభివృద్ధికి భారీ నిధులు: హ్యామ్ కింద రూ. 21 కోట్లు మంజూరు

రిపోర్టర్: సునీల్ స్థలం: నంద్యాల

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఆళ్లగడ్డ పట్టణాభివృద్ధికి హ్యామ్ కింద ఇరవై ఒక కోట్లు మంజూరయ్యాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులు రాకముందే గత రెండున్నర సంవత్సరాలలోనే ప్రభుత్వం తరఫున పది కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. పట్టణ సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు.