రాజస్థాన్‌లో సెట్ పరీక్ష బాయ్‌కాట్, ప్రశ్నపత్రాల ఆలస్యంపై అభ్యర్థుల నిరసన

రిపోర్టర్: రమేష్ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లో ఎస్ఈటీ పరీక్ష సందర్భంగా జైపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్ణీత సమయానికి 30 నిమిషాల ఆలస్యంగా ప్రశ్నపత్రాలు రావడంతో అభ్యర్థులు పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగాయని, పదవ తరగతి విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా పెట్టారని అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.