కారేపల్లిలో ప్రజావాణికి కరువైన స్పందన: నాలుగు గంటల్ లో ఒకే ఒక్క దరఖాస్తు
రిపోర్టర్: గోపి
స్థలం: కారేపల్లి
కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అధికారులు తెలిపారు. నాలుగు గంటల పాటు అధికారులు నిరీక్షించినప్పటికీ కేవలం ఒకే ఒక్క దరఖాస్తు మాత్రమే అందిందని, అది కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ సమర్పించారని వెల్లడించారు. ఫిర్యాదుదారులు ఎవరూ హాజరుకాకపోవడంతో అధికారులు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిణామం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.