విశాఖలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా మధురవాడ ఆర్టీసీ కాలనీలో కోమలి (30) అనే వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గతంలో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, కొద్దికాలంగా ఇక్కడ ఒంటరిగా నివసిస్తోంది. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.