తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
రిపోర్టర్: విజయ్
స్థలం: ఖమ్మం
తెలంగాణ యువత ఆశించిన ఆకాంక్షలను జనసేన పార్టీ నెరవేరుస్తుందని, రాష్ట్రంలో పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రథాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.