కరువు మండలాల ప్రకటనతో అన్నదాతలకు దక్కిన భారీ ఊరట

రిపోర్టర్: వెంకటాపురం విష్ణు స్థలం: నల్గొండ

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గుర్రంపోడు అనుముల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల రైతాంగానికి ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.