టామ్ హార్డీ వివాదంపై స్పందించిన పియర్స్ బ్రాసన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
మొబ్ ల్యాండ్ 2 ప్రీమియర్ సందర్భంగా టామ్ హార్డీ వివాదంపై వస్తున్న వార్తలపై నటుడు పియర్స్ బ్రాసన్ స్పందించారు. ఇదంతా కేవలం చిన్న విషయమని, దానిని అతిగా భూతద్దంలో చూపించారని స్పష్టం చేశారు. తమ టీమ్ అంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తోందని, టామ్ హార్డీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. సెట్స్‌లో ఎలాంటి తీవ్రమైన గొడవలు లేవని స్పష్టం చేశారు.