'బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్‌కు బ్రెయిన్ స్ట్రోక్': చైనా అధ్యక్షుడు అనారోగ్యంపై వైరల్ వార్తలు
రిపోర్టర్: సునీల్
స్థలం: చైనా
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై స్పృహతప్పి పడిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వైరలవుతున్నాయి. చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్ వాంజున్ షీ ఎక్స్ వేదికగా చేసిన ఈ సంచలన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. అస్వస్థతకు గురైన జిన్‌పింగ్‌ను ప్రత్యేక విమానంలో అత్యవసరంగా చైనాకు తరలించి మిలిటరీ ఆసుపత్రిలో చేర్చారని, అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదని సమాచారం.