ప్రజల హక్కుల పరిరక్షణే తన ధ్యేయమన్న కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన దీక్షకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో సోమవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రజలతో కలిసి సాగించిన పోరాటం ఫలితంగానే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటైందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.